Logo
Date of Publish : 04 December 2021, 1:07 pm
Editor : Sake Naresh

వైసీపీ ఆరాచకపాలనపై జనసేన పూరించిన శంఖారావమే *ఛలో చెరుకుపల్లి* అర్బన్ జిల్లా జనసేన నాయకులు ఆళ్ళ హరి

   గుంటూరు, (జనస్వరం) :  వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా అభివృద్ధి జరగకపోగా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేలా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఛలో చెరుకుపల్లి వేదికగా జనసేన సమరశంఖారావాన్ని పూరిస్తోందని జనసేన పార్టీ అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు నేతృత్వంలో ఆదివారం చెరుకుపల్లిలో తలపెట్టిన *ఛలో చెరుకుపల్లి* బహిరంగ సభ గోడప్రతులను శ్రీనివాసరావుతోటలోని జనసేన జెండా సెంటర్లో ఆళ్ళ హరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఆరాచకపాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవగాహనా రాహిత్య పాలనతో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. వైసీపీ నేతల అసమర్ధ పాలన వల్ల పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, రైతులు ఇలా ఏ ఒక్క వర్గంవారు కూడా సంతృప్తిగా ఆనందంగా లేరని ధ్వజమెత్తారు. చివరికి కొన్ని దశాబ్దాల క్రితం కట్టుకున్న పేదల ఇళ్లకు సైతం ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వేలకు వేలు కట్టాలని ప్రజల్ని జలాగల్లా పీడిస్తున్నారని, డబ్బులు కట్టని పక్షంలో పెన్షన్లు  ఆపేయాలని, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వ నియంతృత్వానికి బలవుతున్నారో వారికి అండగా ఉండేందుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు పార్టీ అధినాయకులందరూ చెరుకుపల్లి బహిరంగ సభ వేదికగా సమరశంఖాన్ని పూరించనున్నారని ఆళ్ళ హరి అన్నారు. ఈ బహిరంగ సభలో జనసైనికులు, వీర మహిళలతోపాటు పార్టీలోని అన్నీశ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు చెన్నా పోతురాజు, బండారు రవీంద్ర, కోలా అంజి, మాదాసు అన్వేష్, తిరుపతి, బాజి, మజ్జిద్, యాకోబు, మదార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com