రేణిగుంట, (జనస్వరం) : చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణములోని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న బస్సుల సమస్య చెన్నై, పుత్తూరు, సత్యవేడు, నగిరి, వెళ్లే బస్సులు రేణిగుంట పట్టణం మీదుగా వెళుతుండగా, రైల్వే ఫ్లైఓవర్ పనుల నిమిత్తం బైపాస్ కు మళ్లించారు. ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యి 7 సం.లు అయినా కూడా బస్సులు మాత్రం ఇంకా బైపాస్ లోనే వెళ్తున్నాయి. దీనివల్ల పట్టణంలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట చెన్నై, పుత్తూరు, నగిరి, సత్యవేడు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు 3kms దూరంలో ఉన్న బైపాస్ కి వెళ్ళడానికి, ముఖ్యంగా ఆ ప్రాంతాల నుండి రాత్రి సమయాల్లో రేణిగుంటకి రావడానికి బైపాస్ జంక్షన్ లో దిగి రావాలంటే ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు జంక్షన్ లో దిగి రావాలంటే ఆకతాయిలు, తాగుబోతుల వల్ల ఇబ్బందులు పడుతూ, ఆటోలకు వందల రూపాయలు డిమాండ్ చేస్తే ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ని సార్లు ప్రజలు అభ్యర్థిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు అని, ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈరోజు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారిని కలిసి ఈ సమస్యని వివరించి, రేణిగుంట పట్టణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రేణిగుంట మీదుగా వెళ్లే ప్రతి బస్సును బైపాస్ లో కాకుండా, పట్టణంలోకి వచ్చి వెల్లేట్టు చర్యలు తీసుకోవాలని వినతి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ గారికి, తిరుపతి RTO గారికి కూడా పంపుతున్నట్లు RM గారికి తెలపడం జరిగింది. సమస్యను పరిష్కరించని యడల ప్రజలతో కలిసి జనసేన పార్టీ పోరాటం చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు త్యాగరాజులు, పార్థసారథి, గంగా, లోకనాధం,జ్యోతి, గోపి, మాజీ ఎంపీటీసీ జయలలిత తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com