మాడుగుల ( జనస్వరం ) : జి.మాడుగుల మండలం, జి.మాడుగుల పంచాయతీ, సొలభం పంచాయతీ, గెమ్మెలి పంచాయితీ పరిధిలో ఉరుము, గూఫిగడ్డ, భూంబొడ్డు, మధురుమామిడి, మద్దుల బంద గ్రామాలకు వాతావరణ కాలుష్యం ఏర్పాడే విధంగా జాతీయ రహదారి కోసం నల్ల రాయి క్వారీ ఏర్పాటు చేయడం కారణంగా పైన తెలిపిన గ్రామాలు పూర్తిగా దుమ్ముతో కలుష్యంగా తయారై ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఆ గ్రామాలకు కాపీతోటలు, మిరియాలు తోటలు, త్రాగు నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. కావున మా గ్రామాల ప్రజలందరు దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంపై రాజకీయంగా జనసేన, తెదేపా పార్టీలు మాకు అండగా నిల్వలని గ్రామస్తులు కోరడమైనది. దీనికి స్వయంగా పాడేరు తెదేపా పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే, మరియు టీడీపీ నాయకులు జనసేన తరుపున మండల అధ్యక్షుడు మసాడి భీమన్న, మసాడి సింహాచలం పాల్గొని ఆ గ్రామ ప్రజలకు మేము మీకు అండగా తోడుగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయం జిల్లా పరిధిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం ఈ విషయమై స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారని జి.మాడుగుల మండల జనసేనపార్టీ అధ్యక్షులు మాసాడి భీమన్న తెలిపారు. ఈ సందర్బంగా జనసైనికులు, స్థానిక జనసేనపార్టీ నాయకులు, తెదేపా పార్టీ కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు.