
విశాఖలో 38 J బస్సు సేవలను తిరిగి ప్రారంభించడానికి జనసేన కృషి
విశాఖపట్నంలో 38J బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగింది. వెంటనే ప్రజల అవస్థలను గమనించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు, టీమ్ JCF సహాకారంతో అధికారులకు ఫిర్యాధు చేశారు. అందుకు సమాధానంగా అధికారులు ఆ ఏరియా మొత్తం రోడ్డుకు అడ్డంగా మొక్కలు ఏపుగా పెరిగాయని చెప్పారు. వెంటేనే జనసేన నాయకులు హార్టికల్చర్ విభాగ అధికారులకు సమాచారం అందించి, ఆ మొక్కల కొమ్మలను తొలగించాలని కోరారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ జివిఎంసికి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, ఈ రోజు హార్టికల్చర్ విభాగం వాళ్ళు పని చేయడానికి వచ్చారు. హార్టికల్చర్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా, జనసేన నాయకులు పీలా రామకృష్ణ మరియు టీమ్ JCF, టీమ్ ధర్మశాల, జనసైనికులు ముందుకు వచ్చి హార్టికల్చర్ విభాగానికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి APSEB కి తద్వారా చెట్ల కొమ్మలను కత్తిరించడం జరిగింది. ఫిర్యాదుపై స్పందించిన జివిఎంసి, హార్టికల్చర్ విభాగానికి ధన్యవాదాలు తెలిపారు జనసైనికులు. సమస్యను గుర్తించి పరిష్కార దిశగా చూపించిన చొరవకు స్థానిక ప్రజలు జనసైనికులను అభినందించారు.