అనంతపురము ( జనస్వరం ) : అనంతపురము నియోజవర్గంలో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించగా బుధవారము జనసేన పార్టీ నగర కార్యదర్శిలు లాల్ స్వామి, వల్లంశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీ తపోవనం సర్కిల్ లో జనసేన పార్టీ కార్యాలయంను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు హాజరై ప్రారంభించారు. అదేవిధంగా క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. మహిళలు, యువతలో పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి పట్ల అమితమైన విశ్వాసం కలిగి ఉన్నారని.. ఈ నేపథ్యంలో పార్టీ విధి విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసైనికులుగా మనమందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బూత్ లెవెల్ లో బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సమస్యలపై స్థానిక నాయకత్వం ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని.. మీకు అన్ని విధాలుగా జిల్లా రాష్ట్ర నాయకత్వం అండగా నిలుస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే నినాదాలుగా ప్రజల్లోకి వెళ్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com