పార్వతీపురం జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా అనాధ ఆశ్రయంలో నిత్యావసర సామాన్లు పంపిణీ చేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఈరోజు బొబ్బిలి పట్టణంలో Hand in Hand Society అనాధాశ్రమం లో పిల్లలకు అవసరమైన చాపలు, దుప్పట్లు, భోజనం, పండ్లు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో పాటించవలసిన జాగ్రత్తలను వివరిస్తూ పిల్లలకు మాస్కులు మరియు శానిటైజర్ లను సీతానగరం మండల జనసేన టీం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసైనికులు మాట్లాడుతూ పిల్లలు రేపటి దేశ భవిష్యత్ అని వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు అనాధ పిల్లలకు సహాయం చెయ్యడం ఆయనకి ఇష్టం కనుక ఆయన స్పూర్తితో మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం అని భవిష్యత్ లో పిల్లలకు ఎలాంటి అవసరం ఉన్నా తాము ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది . అలాగే Hand in Hand society చైర్మన్ జైబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఎంపిక అవుతారని ఆంధ్రప్రదేశ్లో అవినీతి, పేదరికం లేకుండా చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసైనికులు శివశంకర్ పోతల, అల్లు రమేష్, పైలా సత్యనారాయణ, యాళ్ల వెంకటేష్, సూర్యనారాయణ,వెంకటరమణ పార్వతీపురం జనసేన నాయకులు అనిల్ చందాక , సురేష్ మరియు బొబ్బిలి జనసేన నాయకులు గంగాధర్ సంచానా, రాజా, నాగు మరియు జనసైనికులు వెంకటేష్, ధర్మ, చింటూ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.