ఆమదాలవలస మండలంలో జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా అహర్నిశలు పనిచేస్తు లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టి ఎంతగానో కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్స్ సబ్బులు ఇవ్వడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు శానిటైజర్లు హాండ్ గ్లౌసెస్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మన్మథ రమేష్ శివ శ్యామ్ నాని తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com