Logo
Date of Publish : 08 December 2020, 3:05 pm
Editor : Sake Naresh

తెలంగాణ డిజీపీ గారికి జనసేన సూటి ప్రశ్న : నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ డిజీపీ గారికి జనసేన సూటి ప్రశ్న : నేమూరి శంకర్ గౌడ్

              ఈరోజు రైతు సంఘాల పేరిట నిర్వహించిన భారత్‌ బంద్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపించిన కార్యక్రమాలు తీవ్ర ఆక్షేపనీయం. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలతో కూడిన బిల్లును ప్రవేశ పెడితే దానిని అర్ధం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బంద్‌ కు మద్దతు ఇవ్వడం సరి కాదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత, రైతులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలపై, తమ హక్కుల కోసం ధర్నాలు చేస్తే అమానుషంగా అడ్డుకుని, హౌస్‌ అరెస్టులు చేపించిన ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా బంద్‌ కు మద్దతు ఇచ్చింది అని జనసేన తరపున ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాము. ప్రజలు ధర్నాలు చేస్తే అక్రమ అరెస్టులు, అణచివేతలు చేసిన పోలీసు వారు, ఈరోజు అధికార పార్టీ నాయకులకు అండగా నిలబడి, దగ్గరుండి మరీ బంద్‌ నిర్వహించేలా చేయడం చట్టాన్ని అవమాన పరిచేలా ఉంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు రోడ్లను బ్లాక్‌ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడంపై ప్రశ్నించిన ప్రజలను తన అనుచరులతో దౌర్జన్యంగా కొట్టించడం దుర్మార్గపు చర్య. పోలీసులు అక్కడే ఉండి కూడా ఎమ్మెల్యే కి వత్తాసు పలకడం చట్టాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉంది. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయమా? చట్టం ఒకరి చుట్టంలా పనిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీనిపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు వివరణ ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఉన్న గౌరవం పోయి, చట్టంపై తిరుగుబాటు చేసే రోజు వస్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com