Logo
Date of Publish : 24 February 2021, 8:01 am
Editor : Sake Naresh

ఏప్రిల్ నెలలో జనసేన కమిటీలు : కొత్తపేట సభలో PAC చైర్మైన్ శ్రీ నాదెండ్ల మనోహర్

                  ఏప్రిల్ నెలలో జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు చేయనున్నట్టు జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో బండారు బుల్లి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో కొత్తపేట నియోజకవర్గం జనసేనాని బండారు శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్ ముందుగా ఇటీవల ఆలమూరు వార్డు మెంబరుగా అఖండ మెజార్టీతో విజయం సాధించి అకస్మిక మృతి చెందిన నరాల నారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తెలిపినట్లు ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్తపేటలో జరిగినందుకు కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావును అభినందించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైతు సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సభ్యత్వం పొందిన రాష్ట్రంలో మొదటి కిట్టును ఆలమూరు మండలంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన జనసేన వీరమహిళ తోట భవానివెంకటేశ్వర్లుకు కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎంత బయపెట్టిన బెదిరించినా కరోనాకే భయపడని జనసైనికులు జగన్మోహన్ రెడ్డికి భయపడతారా అని మాట్లాడుతుండగా ఒక్కసారిగా జనసైనికులు చప్పెట్లతో మారుమోగాయి. సామాన్య ప్రజల కోసం ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడం లేదని వారు వారి కుటుంబ సభ్యులు బంధువులు కోసమే ఆలోచిస్తున్నారని, ఇటువంటి సమయంలో కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టి జనసేన కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఒక ఉద్యోగిని, ఇన్సూరెన్స్ కు సంబంధించిన మరో ఉద్యోగిని నియమించారని ఇలా చేసిన నాయకుడు ఎవరూ లేరని తెలిపారు. ఈ జిల్లాకు రాకముందు కేవలం రైతు సమస్యలపైనే అసెంబ్లీ ముట్టడి చేయాలనుకున్నామని ఈ రోడ్లు చూసిన తర్వాత రోడ్లపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. ఇసుక విధానం గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు పై పలు విమర్శలు చేశారు. జనసేన జెఎసి సభ్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత మద్యం ధనం ఖర్చుపెట్టినా ప్రలోభాలకు లొంగక జనసైనికులు పలుచోట్ల గేలుపొందారని కాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో మరింత విజయంతో ముందుకు జనసేన వెళుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సలాది జయప్రకాశ్ నారాయణ (జేపీ), పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, నామాల సుబ్బారావు, దేశాబతుల సత్యనారాయణ, నాగిరెడ్డి మహేష్, అమ్మిరాజు, తాళ్ల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com