కడపలో ఘనంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కడప అసెంబ్లీ ఇంచార్జ్ మరియు రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదినాన్ని నిరాడంబరంగా సేవా కార్యక్రమాల ద్వారా కొనియాడడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించాలని జనసేన పార్టీ నగర కమిటీ అధ్యక్షులు శ్రీ మాలే శివా గారి నాయకత్వంలో పార్టీ నాయకులు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అమీన్ పీర్ దర్గా యందు మరియు స్థానిక బేర్శభా చర్చ్ నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారు కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజ హితం కోసం పని చేస్తున్నటువంటి కరోనా వారియర్స్ అయిన కొంతమంది విలేకరులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు చిరు కానుకగా జీవిత బీమా చేయించి వారికి పత్రాలను అందజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ స్థానిక కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు ( నగర సమితి నాయకులు ఉంగరాల విజయ్, బాల శెట్టి వంశీ, సాయి లోకేష్, సర్దార్ సాయి, మాలే మల్లేష్, శివ ఇంకా పలువురు రక్త దానం చేసారు). అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో ప్రసూతి వార్డు లోని బాలింతలకు, పాత రిమ్స్ లోని ఆదరణ పట్టణ నిరాశ్రయుల వసతి గృహం లోని నిరాశ్రయులకు, చౌడమ్మ వృద్ధాశ్రమం లోని వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రహ్మణ్యం, నగర అధికార ప్రతినిధి విశ్వనాధ్, నగర కార్యదర్శి కె.సురేష్ బాబు, పి నాగరాజు, శేషు రాయల్, వినయ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.