
ధర్మవరం, (జనస్వరం) : జనసేన కౌలు రైతు భరోసా యాత్ర, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు అప్పుల బాధలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న, కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి తన వంతు సహాయంగా వారికి లక్ష రూపాయలను అందించడానికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ధర్మవరానికి రావడం జరుగుతోందని, ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణములోని వారి స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కౌలు రైతులను ఆదుకోవడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమన్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల దయనీయ పరిస్థితిని గుర్తించి, ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృఢసంకల్పంతో ధర్మవరం రానున్నారని వారు తెలిపారు. కావున వారి పర్యటనను విజయవంతం చేసేలా, అందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.