
శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ సింగనమల నియోజవర్గం ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గల వీరభద్ర స్వామి గుడి వద్ద నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత జన్మదినం సందర్భంగా సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ర్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే 2024 లో జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలని వీరభద్ర స్వామికి పూజలు జరిపించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే నాసేన-నా వంతు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 6 మండలాల కన్వీనర్లు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, క్రియాశీలక కార్యకర్తలు ప్రతిఒక్కరు క్రౌడ్ పండింగ్ లో భాగస్వాములు అయ్యి మన నియోజకవర్గం నుండి దాదాపు రెండు లక్షలు వరకు చేసే విదంగా చెయ్యాలని జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మ, కృష్ణమూర్తి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షలు ఎర్రిస్వామి, శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, పెద్దిరాజు, సాయిశంకర్, తోట మోహన్, కుళ్లాయప్ప సుమన్, విశ్వనాథ్మ, అవ్వారి మురళి కార్యకర్తలు అందరూ పాల్గోన్నారు.