Logo
Date of Publish : 05 May 2022, 4:15 pm
Editor : Sake Naresh

ఆచంట నియోజకవర్గం వల్లూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం

      ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం వల్లూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసైనికుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ పశ్చిమగోదావరిజిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 8 వ తారీఖున కర్నూలు జిల్లాల్లో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న 130 కౌలు రైతు కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఐనా, ఏ రాజకీయ నాయుకుడైనా ప్రజల్లోకి వస్తు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని కళ్ళబోల్లి హామీలతో ప్రజలను మోసంచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల్లోకి వస్తూ రాష్ట్రంలో ఎవరైతే అప్పుల భాదలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబాలకు మనోదైర్యం నింపుతున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం తక్షణ సాయంగా ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న 3000 కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తన కష్టారిజితం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. అందుకు పవన్ కళ్యాణ్ గారికి రైతుల సమక్షంలో జనసేనపార్టీ నాయుకులు పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు తోట తాతాజీ, కడిమి శ్రీనివాస్, యేడిద తేజా విగ్నేష్, పంపన శ్రీనివాసరావు, మాదాసు సత్యనారాయణ , తోట ఫణిద్ర, కడిమి ఉమా మహేశ్వరావు, ప్రసాద్, మోహన్ బాబు, బొక్క జైన్, మొదలగువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com