
చిత్తూరు ( జనస్వరం ) : చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, రామాపురంలో క్రితం 29వ తారీఖు వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూమిని పరిశీలించటానికి వెళ్లిన బీజేపి నాయకులపై భౌతిక దాడిని ఖండిస్తూ జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డు రోకో చేసి నిరసన తెలియచేయడం జరిగింది. ఆ తరువాత కాలినడకన నిరసన తెలుపుతూ స్థానిక MRO గారిని కలిసి వినపత్రం అందచేసి వెంటనే స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు దేవర మనోహర్ మాట్లాడుతూ ఈ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఆకపోతే త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యంగా ప్రజలకు మొరుగైన పాలన అందించాలి తప్ప. ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలను చేయరాదని హితువు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడసాని పురుషోత్తం, మండల అధ్యక్షులు సంజీవిహారి, కిరణ్, వాసు, డిల్లీ, పవన్, లోకేష్ ఇతర జనసేన – బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.