విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని వేడుకలు
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం(పారిశ్రామిక ప్రాంతం) పరిధి లో ఉన్న 7వార్డ్ ల GVMC ఫ్రంట్ లైన్ వర్కర్స్ 300 మందికి నాణ్యమైన నిత్యావసరాల సరుకులు పంపిణీ పంపిణీ కార్యక్రమం టీమ్ JCF ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. టీమ్ JCF సభ్యులు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో తనదైన ముద్ర వేసుకొని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుండి సామాజిక సృహా ఉండడంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. పాతికేళ్ళ భవిష్యత్తు కోసం తన పోరాటం అంటూ యువతని తన వైపు ఆకర్షించారు. జనసేన సిద్దంతాలు నచ్చి ఈరోజు ఎంతో మంది యువత తన అడుగు జాడలో నడుస్తున్నారన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసైనికులు ముందు ఉంటారని, కరోనా విపత్కర సమయంలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యాక్రమాలను నిర్వహించామన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా టీమ్ JCF ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు, సతీష్ వేమన రెడ్డి గారు, పీలా రామకృష్ణ గారు, జనసేన నాయకులు, జనసైనికులు, టీమ్ JCF సభ్యులు తదితరులు పాల్గొన్నారు.