తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : పడాల గ్రామంలో సోమవారం జరిగిన పల్లెపోరు లో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం కి మూడు కిలోమీటర్ దూరంలో నడిబొడ్డున ఆనుకొని ఉన్న పడాల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థపై ఈ నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా త్రాగునీరు సమస్య ఇక్కడ ప్రజలకి శాపంగా మారిందన్నారు. పంచాయతీల్లో నిధులు లేవని అందుకే పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారనీ ప్రభుత్వం మాత్రం గ్రామ సచివాలయ వ్యవస్థను చూసుకొని ఒకవిధంగా సర్పంచ్ లను పక్కనపెట్టేసిందనీ మొన్న ఏపీ ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు చేశారన్న విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవలన్నారు. పంచాయతీల్లో నిధులు లేవని అందుకే పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారన్నారు. సర్పంచ్ పొలిటికల్‌గా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం,రోడ్లు డ్రెయినేజీలు,తాగునీటి సరఫరా వంటి సమస్యలు ఎదరువుతున్నా సకాలంలో పరిష్కరించకపోవడంతో ఈ అంశం నిధులవైపు మళ్లిందనీ,పంచాయతీల్లో నిధులు లేవని అందుకే పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారన్నారు. సర్పంచ్ లను పక్కనపెట్టేసి దీంతో గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం ద్వారా విడుల చేసిన నిధులు ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆరోపిస్తూ ఏ.పి లోని పలు సర్పంచుల సంఘాలు ఆరోపిస్తున్నాయన్నారు. ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు, విజ్ఞాపనలతో నెట్టుకుంటూ వచ్చిన సర్పంచ్ లు ఇప్పుడు నేరుగా ఉద్యమాలకి సిద్ధమయ్యారని గుర్తుచేశారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ పంచాయితీలే దేశానికి పట్టుకొమ్మలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పాలకులు ఆచరణలో మాత్రం పంచాయితీ రాజ్ వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్ధకం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ లు ఆరోపిస్తున్నరని శ్రీనివాస్ అన్నారు.
గ్రామాలలో పారిశుధ్యం, త్రాగు నీరు,రోడ్లు మరమ్మత్తుల వంటి అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ళించడంపై ప్రజలు మండిపడుతున్నరని సర్పంచ్ అనే పేరు తప్ప పంచాయితీ ఖజానాలో చిల్లిగవ్వ ఉంచడం లేదని, పైగా పన్నుల రూపంలో పంచాయితీ ఖాతాలో జమవుతున్న నిధులను కూడా దారిమళ్ళిస్తున్నారని సర్పంచులు వాపోతున్నారనీ అన్నారు. ఇంతకాలం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంతో ఓపికగా ఎదురు చూసినా ప్రభుత్వం నుండి స్పందన లేదని, గ్రామాలలో సమస్యలు తిష్టవేసుకు కూర్చున్నాయని ఇప్పటికైనా పంచాయితీ నిధులు కేటాయించక పోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలలో తిరిగే పరిస్థితి ఉండదనీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలం అధ్యక్షులు అడప ప్రసాద్ స్తానిక నాయకులు కొత్త ధనరాజు, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త వెంకటేశ్వర్లు, కొత్త అంజిబాబు, పుచ్చకాయల మోహన్ బ్రదర్స్, విప్పర్టి శాంతి భూషణ్, కుంచ లక్ష్మణ్, కుంచ జగదీష్, ఉరుముడి ధనరాజ్, కొత్త శ్రీను బ్రదర్స్ మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com