అరకు ( జనస్వరం ) : చింతపల్లి మండలం తాజంగి బీటా లైన్ వీధి,డబ్బగరువు గ్రామాలలో జనసేనపార్టీ నాయకులు గ్రామ పర్యటన చేశారు. చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్ కిల్లో రాజన్ వంతల రాజారావు ఆధ్వర్యంలో భాగంగా జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..గంగులయ్యగారు పాల్గొన్నారు.ముందుగా బీటా వీధి(తాజంగి) నుంచి యువ జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ గిరిజన రాజకీయాలు గత దశాబ్ద కాలం నుంచి విపరీతమైన మార్పులకు గురౌతుందని ప్రస్తుతం మన హక్కులు రాజ్యాంగ విధానానికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. జనసేనపార్టీ గ్రామ పర్యటనలో భాగంగా గిరిజన యువతకి రాజకీయ, గిరిజన చైతన్యం కలిగిస్తూ అనేక సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తున్నాం. యువత రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీకి ఆదరించాలి మార్పు కోసం నవతరం రాజకీయల్లోకి రావాలన్నవారు. అలాగే జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిరిజన యువతపై స్పష్టమైన విధానాలున్నాయన్నారు. అందుకు స్పందించిన యువత అందరూ కచ్చితంగా మార్పు రావాల్సిందేనని బానిసత్వ రాజకీయాలకు అతీతంగా ఓటువేస్తామని మేము జనసేనాని వెంటే ఉంటామన్నారు. ఈ సందర్బంగా పాడేరు జనసేనపార్టీ నాయకులు, సమన్వయ కర్త డా..గంగులయ్య సంయుక్తంగా బీటా లైన్ గ్రామ యువతకు వాలి బాల్ కిట్లు అందించి క్రీడలకు ప్రోత్సహించడమైనది. అనంతరం డబ్బగరువు గ్రామంలో సమావేశం చేశారు. స్థానిక గ్రామస్తులతో డా..గంగులయ్య, ఉల్లి సీతారామ్, కిల్లో రాజన్, భీమన్న వంటి నాయకులు జనసేనపార్టీ సిద్ధాంతాలను చెప్తూ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, లక్ష్యాలు మార్పు కోరే రాజకీయ విధానాలను వివరించారు. గ్రామస్తుల్లో పెద్దమనిషి గాము వరహాల దొర మాట్లాడుతూ మా కుటుంబం ఉద్యమ నేపధ్య కుటుంబమని పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉద్యమ రూపంలో వుంటాయని మార్పు కొరకు నా వంతు నేను కూడా జనసేనపార్టీ వైపే ఉంటానని అన్నారు. రోజు నుంచి పార్టీలో నీకు కూడా భాగస్వామ్యం అవుతాననడం కొసమెరుపు ఈ సందర్బంగా గ్రామస్తులందరు ముక్తకంఠంతో మేమంతా జనసేనాని వైపే ఉంటామన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి బీటా లైన్, సబ్బగరువు గ్రామస్తులు డా..గంగులయ్య గారి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారికి సాదరంగా ఆహ్వానించడమైనది.