Logo
Date of Publish : 10 September 2020, 11:09 am
Editor : Sake Naresh

అంతర్వేది ఉత్సవ రథం విధ్వంసంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు టెక్కలి లో జనసేన-బిజెపి “ధర్మ పరిరక్షణ దీక్ష”

అంతర్వేది ఉత్సవ రథం విధ్వంసంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు టెక్కలి లో జనసేన-బిజెపి "ధర్మ పరిరక్షణ దీక్ష"         

 జనసేన పార్టీ మరియు బీజేపీ ఆదేశాల మేరకు దేవత మూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా టెక్కలి లో జనసేన-బిజెపి "ధర్మ పరిరక్షణ దీక్ష"  చేపట్టారు.  టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ గారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిపై కానీ, సాంప్రదాయాల పైన గాని దాడులు జరిగితే సహిస్తూ ఊరుకోం, హిందూమతంపై కానీ, మహ్మదీయ మతం పై కాని మరియు క్రిస్టియన్ మతం పై కానీ ఎవరు దాడులు చేసినా ఉపేక్షిస్తే చూస్తూ ఊరుకోమని అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వారిపై విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనసేన పార్టీకి భారతదేశం లోని అన్ని మతాలు అన్ని కులాలు సమానం అని అందరి సాంప్రదాయాలని గౌరవిస్తాం అని తెలియజేయడానికి గర్వపడుతున్నాం అని తెలియచేసారు.  హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమని పిఠాపురంలో జరిగిన దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహణం , అంతర్వేదిలో  జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథం దహణం చూస్తుంటే కొన్ని దృష్టశక్తులు కావాలనే హిందువుల మనోభావాల దెబ్బతినేలా, విద్వేషాలు రెచ్చ కొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సర్వమతాలను గౌరవిస్తారని, సంప్రదాయ, ఆచారాలకు విలువ ఇస్తారని వారు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com