వి కోట మండలంలో జనసేన & బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య పాల్గొన్నారు. పలమనేరు జనసేన నాయకుడు పూలచైతన్య మాట్లాడుతూ పంచాయతీ ఎలక్షన్లో అన్ని స్థానంలో జనసేన & బీజేపీ నాయకులు పోటీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. రాష్టంలో ప్రస్తుతం పెరుగిపోతున్న ధరలను నిరసిస్తూ, పంచాయతీల అభివృద్ధికి కావలిసిన నిధుల కేంద్రం ఇస్తుంది కాబట్టి జనసేన & బీజేపీ కూటమి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి కోట జనసేన నాయకుడు av బాబు, శరత్ కుమార్, కళ్యాణ్ కుమార్, శబరీష్ రెడ్డి, సోమశేఖర్, gn గణేష్, మునిరాజ్, బలరాం, సురేష్, జనార్దన్, బీజేపీ యువ మోర్చా శివ, వి కోట మండలం ఇంచార్జ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.