Logo
Date of Publish : 03 September 2022, 5:30 pm
Editor : Sake Naresh

పరిగిలో జనసేనాని జన్మదిన వేడుకలు

           పరిగి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పరిగి మండలం సేవ మందిరం ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ కు ఐశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం. #నా సేన కోసంనా వంతు కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అమౌంట్ సెండ్ చేశారు. మరియు మండలంలో అధిక క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన అశోకు సన్మానం చేశారు. కిట్లను 30 మందికి జిల్లా సంయుక్త మోద శివ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయసాధనలో మా వంతు పాత్ర పోషిస్తామని, ఆయన విధివిధానాలను తు.చ.తప్పకుండా పాటిస్తామని సేవా కార్యక్రమాలను, జనసేన పార్టీని,పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత దగ్గరై ప్రజా సమస్యలపై పోరాటం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని వారన్నారు. జనసేన పార్టీ అంటే అధికారం కోసం ఎగబడే పార్టీ కాదని ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే మొదటి కర్తవ్యంగా భావించిన పార్టీ అని నాయకులు అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ఐకమత్యంగా కార్యకర్త ఐకమత్యంగా పనిచేయాలన్నారు. మండల నాయకులకు కార్యకర్తల ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన సమితిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నారాయణస్వామి, విష్ణు, అశోక్, హనుమంతు, పాపన్న, శ్రీరంగరాజుపల్లి నరేష్, శంకర్, వేణు, అనిల్ కుమార్, జెబి, రవిఅన్న, మంజు, సాయి, శ్రీరామ్, నారాయణ, లక్ష్మీనారాయణ, ఈశ్వర్, ధనుంజయ, అనిల్ హనుమంతు, శివకుమార్ కొండప్ప అభిమానులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com