ఎల్బీనగర్ ( జనస్వరం ) : సరూర్ నగర్ డివిజన్ లో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు జంగాల భాను ప్రకాశ్, ఆకుల భాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. సుమారు 70 మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదానాన్ని అందించారు. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ ను అవసరమైన పేదవారికి అందించాలని ఈ సందర్భంగా జంగాల భాను ప్రకాష్ ఆకుల భాస్కర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్భందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహస్తున్నామని, తమ అభిమాన హీరో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాదాస్, నవీన్, మహేష్క్రాంతి, రాజు, సాయి కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com