Logo
Date of Publish : 03 September 2022, 5:03 am
Editor : Sake Naresh

కొత్తచెరువు మండలంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

        కొత్తచెరువు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు సందర్భంగా కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తచెరువు జనసేన పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక౦ మధుసూధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిలక౦ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల పక్షాన, రైతుల పక్షాన అండగా నిలుస్తున్న మన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషనీయం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు అభిమానులకు ఒక పండుగ వాతావరణం. ఇటువంటి జన్మదిన వేడుకలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జరుపుకోవాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలను పార్టీలో భాగస్వాములను చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటుచేసిన నా సేన కోసం నా వంతు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. ప్రతి ఒక్క జనసేన పార్టీ శ్రేయోభిలాషులు రాష్ట్ర శ్రేయస్సు కొరకు పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి తోడుగా భాగస్వాములు అవుతూ 10 రూపాయల నుండి వారికి తోచిన సాయం జనసేన పార్టీ ఖాతా అయిన 7288040505 నెంబర్ కు PhonPe, GooglePay, PayTm ద్వారా జమ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సామాన్య పౌరుడు భాగస్వాములై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, ధోడిగుంటి నరేంద్ర భూపతి, పసుపులేటి లక్ష్మీనారాయణ, గుడా మధు, గూడా శ్రీనివాసులు, గూడా సోము, సోలంకల రాజు, పూల రెడ్డప్ప, ముతా నరేంద్ర, సల్లప్ప, సోలంకల చంద్ర, ఓబి రెడ్డి, బాలాజీ, కిరణ్, అడ్డగిసిన, కల్లు బండి బాబు, రాజేంద్ర, కరుణాకర్, మారుతీ, సూర్య రాయల్, చంద్ర మణిపురం చంద్ర తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com