Logo
Date of Publish : 03 September 2022, 2:31 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

           కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం మా కోడికి గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సమావేశంలో "నా సేన కోసం నా వంతు" బాధ్యతగా 35 మంది జనసేన సభ్యులు జనసేన పార్టీకి విరాళం అందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మావంతు పాత్ర పోషిస్తాము అని, జనసేన పార్టీ విధి విధానాలను తూచా తప్పకుండా పాటించి జనసేన పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది... నా సేన కోసం నా వంతు బాధ్యతగా మా కోడికి గ్రామంలోని రైతులు స్వచ్ఛందంగా వచ్చి పార్టీకి విరాళం ఇచ్చి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారని అభినందించడం జరిగింది... గ్రామంలోని మహిళలు వారి సమస్యలు తెలియజేశారు. గ్రామంలోని సమస్యలు పరిష్కారం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది. జనసేన కార్యకర్తలు అంతా ఐక్యమత్యంతో కలిసి పనిచేసి జనసేన పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది. నీతి నిజాయితీగల నాయకులను ఎన్నుకున్నప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అని గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది... ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చలపాడి రమేష్, జనసేన వీర మహిళ షేక్ తార, కార్యక్రమాల కమిటీ మెంబర్స్ ఎర్రి స్వామి, సెట్టూరు మండల అధ్యక్షులు కాంత రాజ్, ఉపాధ్యక్షులు రామలింగ, మండల కమిటీ నాయకులు లక్ష్మణ్, గురు స్వామి, ఐదు కళ్ళు, నాగరాజు, సెట్టూరు సతీష్, బొచ్చుపల్లి రజాక్, కైరేవు తిమ్మరాజు, యాటకల్లో శామ్యూల్, ఐదు కళ్ళు నాగరాజు, లింగదీర్లపల్లి గంగన్న, ముక్కన్నా, శ్రీహర్ష మొదలైన జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com