నల్గొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక సందర్భంగా, తన ఆశయాలలో భాగమైన సమాజ అభివృద్ధి ఆకాంక్షకై అడుగులు వేసిన జనసైనికులు, జనసేనాని పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు గొండ్రియాల జనసైనికులు, నాయకులు కలసి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల H M సుధాకర్‌రావు, హమీద్, మల్లికార్జున్, పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో నిరుపేదలకు అన్న దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి తోట నవీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్ద పొంగు కిషోర్, కోదాడ నియోజకవర్గం ఉపాధ్యక్షులు యాండ్రాతి గోపి, మహేష్, jp, సందీప్, pv, రాజు, జానీ పాషా, నాగరాజు, కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com