Logo
Date of Publish : 03 September 2022, 6:15 am
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

     ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈరోజు కేక్ కట్ చేసి జన్మదిన ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో పాములపాటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మరియు నల్లపరెడ్డిపల్లి గ్రామంలో పత్తిపాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో 51 టెంకాయలు కొట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రములోనే కాకుండా, దేశవ్యాప్తంగా విలక్షణమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. తన కష్టార్జితమైన సొమ్మును ఆత్మహత్యలకు పాల్పడిన సుమారు 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రానికి మరియు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా" నా సేన కోసం నా వంతు" కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క జన సైనికుడు తన వంతు ఆర్థిక సహాయాన్ని పార్టీకి అందించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com