Logo
Date of Publish : 03 September 2020, 7:44 am
Editor : Sake Naresh

తిరువూరు జనసైనికుల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు మరియు సేవా కార్యక్రమాలు

తిరువూరు జనసైనికుల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు మరియు సేవా కార్యక్రమాలు

          ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం,  సగటు పేదవాడి గుండె చప్పుడు, ప్రజ సమస్యలపై అలుపెరగని పోరాట యోధుడు, నీతి నిజాయితీ  కల్గిన రాజకీయ అలోచనతత్వ సమ్మేళనంగా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, కోట్లాది ఆభిమానుల ఆరాధ్య దైవం జనసేన అధినేత  శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలలోని పలు సేవా  కార్యక్రమాలు చేయడం జరిగింది.  తిరువూరు మండలం జి.కొత్తూరు గ్రామ పంచాయతీ తాలూకా చిక్కులగూడెం గ్రామ జనసేన సైనికులు తిరువూరు పట్టణంలో అమ్మ అనాధ ఆశ్రమానికి 50 కేజీలు రైస్ ప్యాకెట్స్, వృద్ధుల సేవ సమితి ఆశ్రమానికి 50 కేజిలు రైస్ ప్యాకెట్స్, అంతర్రాష్ట్ర( Ap- Ts) బోర్డర్ చెక్ పోస్ట్ పోలీసులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం, మరియు జి.కొత్తూరులో కేక్ కట్టింగ్ కార్యక్రమం, చిక్కులగూడెం గ్రామంలో కేక్ కట్టింగ్ కార్యక్రమాలు, అలాగే వావిలల గ్రామంలో అన్నదానం కార్యక్రమం, కేక్ కట్టింగ్, తిరూవూరు పట్టణంలో థియేటర్లో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం, కేక్ కట్టింగ్, అమ్మ ఆశ్రమంలో అన్నదానం, వృద్ధుల సేవ సమితి ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. 

                  గంపలగూడెం మండలంలోని మేడూరు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ పవన్  కళ్యాణ్  గారి గోత్రనామాలతో పూజ కార్యక్రమం, పేదలకు దుప్పట్ల పంపిణీ, కేక్ కట్టింగ్, కోవిడ్ 19 కారణంగా సర్వం కోల్పోయి కనీసం తినడానికి ఇబ్బంది పడుతున్న వినాయక విగ్రహతయారి దారులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, రైస్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.  ఏ.కొండూరు మండలంలో లకావాతు విజయ్ ఆధ్వర్యంలో 140 మందికి అహరపోట్లల పంపిణీ, ఏ.కొండూరులో వృద్ధులకు అన్న వితరణ, విజయవాడ - ఛత్తీస్గడ్ హైవే పై లారీ డ్రైవర్ లకు అహర పోట్లాల  పంపిణీ కార్యక్రమం చేశారు.  విస్సన్నపేట మండలంలో మొక్కల నాటి, కేక్ కట్టింగ్ కార్యక్రమాలు తిరువూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు  మరియు చిరంజీవి గారి ఆభిమానులు, క్రిష్ణజిల్లా (పశ్చిమ) చిరంజీవి యువత సభ్యులు, పాల్గొన్ని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు తిరూవూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com