శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లాలో అదపాక, అల్లినగరం, బుడుమురు జంక్షన్ లో పల్లె వెలుగులు బస్సులు ఆపడం లేదు అని కొంత మంది విద్యార్థులు కాకర్ల. బాబాజీ కి తెలియజేయడం జరిగింది.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి, పంచకర్ల సందీప్ గారి స్పూర్తి తో వినీల్ విశ్వంభరదత్ గారి ప్రతిపాదనతో ఈ రోజు RTC డిపో CI రమేష్ గారికి లేఖ ద్వార శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యుడు కాకర్ల బాబాజీ వివరించడం జరిగింది. అలాగే స్పెషల్ బస్సు లు విద్యార్థుల కొరకు నడిపించాలని కోరడం జరిగింది. CI రమేష్ గారు మాట్లాడుతూ పల్లె వెలుగు బస్సు RTC డ్రైవర్ తో మాట్లాడి తప్పకుండా ఆయా జంక్షన్ లో నిలబడమని చెపుతాను అని చెప్పడం జరిగింది. ఏ పల్లె వెలుగు బస్సు అయినా నిలపకపోతే నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. స్పెషల్ బస్సు గురించి నేను అధికారులతో మాట్లాడుతాను అని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి డిపో CI రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8మంది భగత్ సింగ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com