ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులతో కలసి అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులతో కలసి దర్నా చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తయారుచేయబడే చట్టాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలే కానీ ఇంకాస్త ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రం. గతంలో ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రకృతి సహజ వనరు అయిన ఇసుక ఇప్పుడు అందని ద్రాక్ష పండులా తయారైన విషయం మనకందరికీ తెలిసినదే. స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేని ఇసుక సరిహద్దులు దాటి పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.అంతేకాకుండా వాల్టా చట్టం(వాటర్ ల్యాండ్ అండ్ ట్రీ )అనుసరించి నదీగర్భంలో యంత్రాల సాయంతో ఇసుక తవ్వకాలు నిషేధించడం జరిగింది. అయినప్పటికీ యంత్రాల సహాయంతో ఇసుక తవ్వకాలు జరుపుతూ నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తూ ఉన్నారు. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అంతేకాకుండా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్న స్థానిక ప్రజల యొక్క ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికంగా సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఇసుకను ఇవ్వటమే కాకుండా స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ భారతీయ జనతాపార్టీ సంయుక్తంగా డిమాండ్ చేస్తుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com