
మైలవరం ( జనస్వరం ) : గత కొంతకాలంగా మత్స్యసంపద తగ్గు ముఖం పడటం వల్ల చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సరైన చాపలు అనుకున్నంత స్థాయిలో లభించకపోవడంతో జీవనాధారం కోల్పోతున్న సమయంలో జనసేన పార్టీ వారికి అండగా నిలిచింది. మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు తుమ్మలపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో తమవంతు సహాయంగా సుమారు పాతికవేల చేప పిల్లలను మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల గాంధీ గారి చేతుల మీదగా కృష్ణ నదిలో విడుదల చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి చింతల లక్ష్మీ, గ్రామ అధ్యక్షుడు తిరుమల శెట్టి పవన్, గ్రామ జనసేన పార్టీ నాయకులు చెల్లు పూర్ణచంద్రరావు, శీలం నరేష్, చెల్లు చంటిబాబు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు హాజరవ్వడం జరిగింది.