తిరుపతి ( జనస్వరం ) : న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ బాసటగా నిలిచారు. బుధవారం సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే వారికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. జనసేన అండగా నిలవడంపై సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు ద్వారా పవన్ కళ్యాణ్ కు తమ ద్రుష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. త్వరలో తమ ప్రభుత్వం రాబోతోందని కచ్చితంగా సమస్యలను పరిష్కరించేందుకు క్రుషి చేస్తామన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకెళుతానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాయలసీమ మహిళా కరో్డినేటర్ ఆకుల వనజ, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాబ్జి, బాటసారి, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఉపాధ్యక్షులు పార్ధు, లక్ష్మి, నగర ప్రధాన కార్యదర్శి దినేష్ జైన్, రుద్ర కిషోర్, రాజేష్ ఆచారి, నగర కార్యదర్సులు, చరణ్ రాయల్, కిరణ్ కుమార్, లోకేష్, బాలాజీ, హేమత్, పురుషోత్తం, సాయికుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, సీనియర్ నాయకులు చందు, వంశీ, తిరుపతి అర్బన్ అధ్యక్షులు జనసేన సాయి, జనసైనికులు రవి, మోహిత్, ఇంద్ర, బాలాజీ, వీరామహిళలు దుర్గ, వరలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com