Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అండ

     అమరావతి, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అధికారంలోకి వస్తే ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చి… ఇవాళ ఆ హామీని ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదట ఏడాది తూతూ మంత్రంగా సాయం చేసి గత రెండేళ్లుగా ముఖం చాటేసిందని స్పష్టం చేశారు. చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, వారికి కొంతైనా ఊరటనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పూజలనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు, ఆనందం రావాలనే కోరుకునే రోజు. కానీ కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటే బాధనిపిస్తోంది. పోరాట యాత్ర, మండపేట పర్యటన, కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో, నివర్ తుపాన్ సమయంలో స్వయంగా కౌలు రైతులతో మాట్లాడాను. వారు పడుతున్న బాధలు విని కన్నీరు వచ్చింది. వాళ్లు సాగు చేయడానికి సొంతభూమి లేకపోయినా… ఈ రోజు మనం తినే 80 శాతం తిండి కౌలు రైతు కష్టం, శ్రమ నుంచి వచ్చిందే. ఈ రోజు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటున్నామంటే దానికి కారణం కౌలు రైతే. వాళ్లు కష్టపడి మన కడుపు నింపినందుకు వాళ్లకు మనమిచ్చే బహుమతి 3 వేల చావులు.

మిల్లర్లు… దళారులు లాభపడుతున్నారు

భూములను కౌలుకు తీసుకొని, ఎరువుల నుంచి విత్తనాల వరకు అప్పులు చేసి వ్యవసాయం చేస్తే కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చడానికి, భార్య, పిల్లల కడుపు నింపడానికి నిస్సహాయ స్థితిలో పండిన పంటను నష్టానికి అమ్ముకుంటున్నాడు. రైతు దగ్గర నుంచి మిల్లర్లు, దళారులు ధాన్యం బస్తా రూ.700కు కొని, దానిని రూ. 1400కు అమ్ముకొని లాభం చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం రూ. 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కానీ అనధికారికంగా దానికి రెండింతలు అంటే దాదాపు 45 లక్షల మంది కౌలు రైతులు తమ శ్రమను ధారపోస్తే ఈ రోజు ప్రతి ఒక్కరం ఒక ముద్ద తింటున్నాం.

● బాధిత కుటుంబాలకు పరామర్శ కూడా లేదు

సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 80 మంది.. అనంతపురం, కర్నూలు జిల్లాలో 150 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరామర్శించడానికి అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. మనం ఏదైనా మాట్లాడితే మన మీద విరుచుకుపడతారు తప్ప రైతుకు అండగా నిలబడటానికి మాత్రం ముందుకు రారు. రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర రూ. కోటి నిధి ఉంటుంది. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు.

 ● నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆగదు

ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది. వారికి కొంతైనా ఊరట ఇవ్వాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు జనసేన పక్షాన రూ. లక్ష ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడ్డ ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని నేనే వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తాను. లక్ష రూపాయలు సాయం చాలా చిన్నదే అవ్వొచ్చు కానీ అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదు. మనమంతా ఉగాది పండగ జరుపుకొంటుంటే మీరు కన్నీరుపెడితే అది ఉగాది అవ్వదు. కౌలు రైతు కుటుంబాలు బాగుండాలి, వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సాయం అందిస్తున్నాం. కౌలు రైతులకు మేమంతా అండగా ఉంటాం. మీరు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఈ ఉగాది మీ కుటుంబాలకు ఎంతో కొంత ఊరట ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే భూ అధీకృత సాగుదారు చట్టం-2011 లోపభూయిష్టంగా ఉందని చెబుతూ వైసీపీ ప్రభుత్వం 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం మరింత లోపభూయిష్టంగా మారింది. ఈ చట్ట ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు ఇవ్వాలి. ఈ కార్డులు పొందాలంటే 11 నెలలకు సంబంధించిన కౌలు ఒప్పంద పత్రాలపై భూ యజమానులు సంతకాలు చేయాలి. భూ యజమానులు సంతకాలు చేయకపోవడంతో కౌలు రైతులకు కష్టాలు మరింత పెరిగాయి. ఈ చట్టాన్ని మార్చే విధంగా, ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందేలా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way