కార్వేటినగరం ( జనస్వరం ) : ఆర్ కె వి బి పేట గ్రామ పంచాయతి, రాజుల కండ్రిగ గ్రామం నివాసి రంగనాథంను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. రంగనాథం గత సంవత్సరం రోజులుగా రెండు కిడ్నీలు పాడైపోయి, రీనల్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ, తిరుపతి రుయా హాస్పిటల్ నందు డయాలసిస్ చేసుకుంటూ, కడు పేదరికంలో జీవిస్తున్నారు. వీరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, డయాలసిస్ చేసుకుంటున్న రోగులకు పెన్షన్ ఇరవై వేలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైద్యం పూర్తిగా ఉచితం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, ఆ కుటుంబంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కుటుంబ యజమాని అనారోగ్యానికి గురైతే ఈ విధంగా ఆదుకోవడం, మానవీయత కోణంలో ఆలోచించి అండగా నిలబడటం ద్వారా ఆర్థిక భరోసా కల్పించవచ్చని తెలియజేశారు. దయనీయమైన స్థితిలో ఉన్న పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం సహాయ పడాలని కోరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగనాధంకు పదివేలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా జనసేన కుటుంబానికి అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల బూతు కన్వీనర్ అన్నామలై, మండల కార్యదర్శి రూపేష్, జనసైనికులు ఉన్నారు.