– కుప్పంలో జనసేన నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
– జనసేన కేడర్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
– జనసేన, టిడిపి నేతలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని చంద్రబాబు ఉద్భోధ
తిరుపతి ( జనస్వరం ) : అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివ్రుద్ది పధంలో నడిపించేది టిడిపి, జనసేనే అన్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పంలో జరిగిన జనసేన నేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అంతకు ముందు ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, మండల అధ్యక్షులను చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివ్రుద్ది చేసే బాధ్యత జనసేన., టిడిపి పై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల నాయకుడు అన్నదమ్ముల్లా కలిసి మెలసి రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. కుప్పంకు అంతమంది జనసేన నాయకులు రావడం, సమావేశ మందిరం జనసేన కేడర్ తో కిక్కిరిసి పోవడం చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను అభినందించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని, ప్రజలను గెలిపించాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో అన్నింటినీ కైవసం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనుభవం ఉన్న చంద్రబాబు, ఆశయం ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఏకమయ్యారని, ఇద్దరి సారధ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివ్రుద్ది చెందుతుందన్నారు. ప్రశ్నించే నైజం కలిగిన తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో సమస్యలను ప్రశ్నించే పరిష్కరించేలా చేశారన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల, విశాఖ ఉక్కు సమస్య, అన్నమయ్య బాధితుల పక్షాన పోరాడటం, కౌలు రైతలుకు సొంత నిధులను అందించడం ఇవన్నీ ఆశయంతోనే చేశారన్నారు. అలాగే ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చిన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లతో గద్దెనెక్కాలనుకుంటున్న జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, మండల అధ్యక్షులు, జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.