Logo
Date of Publish : 14 September 2020, 4:52 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తి ఆలయ ఘటన పై తీరును నిరసిస్తూ జనసేన, బీజేపీ పార్టీల నిరసన

శ్రీకాళహస్తి ఆలయ ఘటన పై తీరును నిరసిస్తూ జనసేన, బీజేపీ పార్టీల నిరసన

                 దక్షిణ కాశీగా పేరొందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ఆచారానికి విరుద్ధంగా గర్భాలయంలో శివలింగం నందీశ్వరుడు ప్రతిష్టించిన ఘటన పై జరుగుతున్న విచారణలో దేవాదాయశాఖ తీరును నిరసించారు. భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు తిరుపతిలోని ప్రాంతీయ సంయుక్త కమిషనరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.  అధికారులు ఎంతకు స్పందించకపోవడంతో కార్యాలయం లోపలకు వెళ్లి భజన చేస్తూ తమ నిరసన తెలిపారు.దీంతో స్పందించిన కమిషనర్, ఈ సంఘటనకు సంబంధించిన  బాధ్యులపై 48 గంటలలోపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించిన నాయకులు,  ఆలయంలో విగ్రహల ప్రతిష్టకు  అనుమతి ఇచ్చినందుకు మొదటి బాధ్యుడిగా ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని అలాగే ఈ  అపచారానికి పాల్పడిన ప్రతిఒక్కరిపై ఇచ్చిన గడువులోపు చర్యలు చేపట్టకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని డిమాండ్ చేసారు.   ఈ నిరసన కార్యక్రమంలో బిజేపీ నాయకులు కోలా ఆనంద్,  భానుప్రకాష్ రెడ్డి , సామంచి శ్రీనివాస్ , జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి,  అకేపాటి సుభాషిణి, బాబ్జి, పగడాలమురళి, భూనపల్లి మునస్వామి, కొండా రాజమోహన్, సుమన్, సాయిదేవ్, చందు, సురేష్ తదుతరలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com