రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పంచాయితీ ఎన్నికలలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో ఒక ప్రైవేట్ హాల్ నందు నియోజకవర్గ జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా అన్ని గ్రామాల్లో నియోజకవర్గ జనసేన, భారతీయ జనతా పార్టీలు పంచాయితీ ఎన్నికలలో పోటీకి సిద్ధం అని పత్రికా ముఖంగా వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం నియోజకవర్గ వ్యాప్తంగా రాబోతోంది అని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సుమారుగా కొన్ని వేల మంది ఓటర్లు యువతగా ఉన్నారని, పంచాయితీ పాలనను సుపరిపాలనగా మార్చే విధంగా యువత పోటీకి ముందుకు వస్తున్నారని వారు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 మండలాల్లో కలిపి సుమారుగా 50 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను, అన్ని పంచాయితిలలో వార్డ్ మెంబెర్స్ ని కూడా పోటీలో పెట్టటం జరుగుతుందని వారు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా అన్ని మండలాలలో నామినేషన్ కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని తెలియచేసారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఎన్ఆర్ఈజియస్ నిధులు సద్వినియోగం కావాలంటే పంచాయితీల్లో యువత భాగస్వామ్యం అవసరం అని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి నియోజకవర్గ జనసేన, భారతీయ జనతా పార్టీల తరుపున పూర్తి సహకారం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ముత్యాల వెంకట శ్రీనివాసరావు, నాయకులు ఈమని కిషోర్ కుమార్, భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అన్నెపాగ ప్రపుల్ల శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొడాలి అపర్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసా పల్లపురాజు, మండల ఇంచార్జ్ నుసెట్టి రంగారావు, నాగ, రాం, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com