Logo
Date of Publish : 03 September 2021, 4:03 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సొంత డబ్బులతో స్కూల్ గ్రౌండ్ శుభ్రము చేసిన జనసేన అనంతపురము జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి

     అనంతపురము, (జనస్వరం) :  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో నా వంతుగా సమాజానికి సేవ చేయాలని తలచి, అనంతపురం పట్టణంలో, బుడ్డప్ప నగర్ లోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్ పరిసర ప్రాంతం అంతా ప్రభుత్వ నిరాదరణకు గురై పిచ్చిమొక్కలు, కంపచెట్లుతో పాములు తిరుగుతున్న తరుణంలో పిల్లలు ఆవరణలోకి పోవడానికి భయభ్రాంతులకు గురవుతు చాలా ఇబ్బంది పడుతున్నారని, నా దృష్టికి రాగానే నా సొంత నిధులతో స్వయంగా శ్రమదానం చేసి స్కూల్ ఆవరణమంతా శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించిన జనసేన నాయకులు మెరుగు శ్రీనివాస్ గారికి, హుస్సేన్ గారికి, పవన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ విషయం తెలియగానే రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వాహక కార్యదర్శి శ్రీ భవాని రవి కుమార్ గారు మరియు మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మా ఈ సేవలను గుర్తించి స్కూల్ హెడ్మాస్టర్ గారు మరియు టీచర్స్ బృందం అభినందనలు చేస్తూ ప్రశంసా పత్రం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసినారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com