Logo
Date of Publish : 18 November 2020, 10:31 am
Editor : Sake Naresh

మాకవరపాలెం మండల కార్యాలయం వద్ద జనసేన ఆందోళన

మాకవరపాలెం మండల కార్యాలయం వద్ద జనసేన ఆందోళన

                    విశాఖ జిల్లా నర్సీపట్నంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేసిన చెరువులను ప్రభుత్వ పెద్దల అండతో వాటిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాకవరపాలెం మండల కార్యాలయం వద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు.విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తూటిపాల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 210లో 76.55సెంట్ల భూమి ఉంది. దీంతో పాటు పది ఎకరాల చెరువును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు నాలుగున్నర కోట్లతో అభివృద్ధి చేయించారు. అయితే ఇదే సర్వే నెంబర్లో 10 సంవత్సరాల క్రితం బుచ్చన్న పాలెం గ్రామానికి చెందిన రెడ్డి సన్యాసినాయుడు పేరు మీద మూడు ఎకరాల 50 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు అసైన్ చేసారు. అయితే ఈ భూమి చాలా కాలం క్రితం నుంచి రావు ఖాతాలో ఉంది. ఈ భూమిని ప్రభుత్వ పెద్దల ద్వారా అక్రమ దారిలో పొందే ప్రయత్నం చేస్తున్నట్లు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న సూర్యచంద్ర ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ మాకవరపాలెం మండల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆ తర్వాత మండల కార్యాలయానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ భూ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com