గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరం : గుంటుపల్లి తులసి

                        తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది… రహదారి లేదు… ఇతర సౌకర్యాల కల్పన ఏమైంది అని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఈ రోజు శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు గారిని కోనపల్లిలో పారి శుద్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రహదారులు లేవు…. ఇతర ఏ సౌకర్యాలు లేవని.. ఎప్పుడు కల్పిస్తారని జనసేన కార్యకర్త శ్రీ వెంగయ్య నాయుడు గారు ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు గారు – నీ మెడలో పార్టీ కండువా తియ్యమని మొదలుపెట్టి సభ్యసమాజంలో పలకలేని భాషలో మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారు ప్రశ్నించిన ఆ యువకుణ్ణి ప్రజల మధ్య బెదిరించిన ఎమ్మెల్యే- తదుపరి తన పార్టీ వ్యక్తుల ద్వారా బెదిరించడం, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ రోజు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యాము. ఆయన కుటుంబానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున క్రియాశీలక నాయకురాలు గుంటుపల్లి తులసి కుమారి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. 

ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : 

తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరపున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే శ్రీ వెంగయ్య నాయుడు చేసిన తప్పా, అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదు…. ఆ ఊరిలో ప్రజల కోసం మాట్లాడాడు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించింది. ఆ నియోజకవర్గం యొక్క బాధ్యత కలిగిన ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవలిసిందేనా? ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేనప్పుడు ఆ పదవిలో ఉండి ఏమి ఉపయోగము సదరు ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, శ్రీ వెంగయ్య నాయుడు మృతిపై తక్షణమే విచారణ చేయించాలి మరియు అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలి. అతన్ని బెదిరింపులకు గురి చేసిన, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే శ్రీ రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకురాలు గుంటుపల్లి తులసి కుమారి గారు , పట్టణ క్రియాశీలక నాయకులు ఉసా ప్రసాద్ గారు మరియు కొట్రా మణికంఠ గారు, కర్లపాలెం మండలం క్రియాశీలక నాయకులు చిలకల సురేంద్రబాబు గారు, మరియు జనసైనికులు, కంచర్ల పల్లి నరేంద్ర గారు, పెద్ది సాయి కుమార్ గారు,గంట సాయికుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way