Logo
Date of Publish : 07 August 2021, 5:11 pm
Editor : Sake Naresh

ప్రజల సమస్యలు పరిష్కరించడం జనసేన కార్యకర్త లక్ష్యం : జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు

  గూడూరు, (జనస్వరం) :   జనసేన పార్టీ సిద్ధాంతాలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి  ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం భీమా పథకంను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 వేలు, దురదృష్టవశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి 5 లక్షలు అందచేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శి అల్లం బాబు, నాయకులు పెద్దిశెట్టి కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ పార్టీ అభిమానులు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమురు మండలాల నాయకులు రాజశేఖర్, జమాల్ భాష, మనోజ్ కుమార్, విష్ణు, మోహన్, మణి, ఓంకార్, సాయి, శివ, శశి, వెంకటేష్, జనార్ధన్, తేజ, నాగమణి, గని, సుమంత్, పరశురాం తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com