పెందుర్తి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, E గంగవరం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలు పెట్టారని, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్సూరెన్స్ మీద అంతగా అవగాహన ప్రజలకు ఉండదు అని కావున క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేలు, మరణించినట్లయితే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున ప్రతి జన సైనికుడు ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని కోరడం జరిగింది. నాయకులు జనార్థన శ్రీకాంత్ వబ్బిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతులమీదుగా 2022-23 క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడం జరిగిందని, గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్షకు పైగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని, గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకొని అకస్మాత్తుగా మరణించిన 38 మందికి 5 లక్షల రూపాయలు చెక్కు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా అకస్మాత్తుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి వైద్యం నిమిత్తం 50 వేలు రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం పెందుర్తి నియోజకవర్గలో ఏడు మెట్ల మర్రిపాలెంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వంలో పాలు పంచుకోవాలి అని, చివరి తేదీ మార్చి 7 తారీకు కావున అందరూ తొందరగా సభ్యత్వం చేసుకోవాలని కోరడం జరిగింది. వీర మహిళ పార్వతి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది మనమందరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే దానిలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవింద్, శ్రీను, రాజు, రాము, ప్రసాద్, గోపి, జనసైనికులు పాల్గొన్నారు.