Logo
Date of Publish : 23 February 2022, 4:21 pm
Editor : Sake Naresh

జనసేన క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం : జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

              పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనార్థన శ్రీకాంత్ వబ్బిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతులమీదుగా 2022-23 క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్ష పై చిలుకలు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని, గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకొని అకస్మాత్తుగా మరణించిన 18 మందికి 5 లక్షల రూపాయలు చెక్కు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా అకస్మాత్తుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి వైద్యం నిమిత్తం 50 వేలు రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 40 మందికి ఈ క్రియాశీలక సభ్యత్వం ఎన్రోల్మెంట్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారని, ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ యో గ్రామ, వార్డు, నియోజకవర్గ, పరిధిలో జనసేన కుటుంబ సభ్యుల్ని గుర్తించి క్రియాశీలక సభ్యత్వం కోసం వివరించి వారందరికీ సభ్యత్వాలు చేయాలని కోరారు. జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రాంత పరిధిలో ఉన్న జనసేన పార్టీ నాయకులును సంప్రదించి క్రియాశీలక సభ్యత్వం కోసం తెలుసుకొని బాధ్యతగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో 2 వేలుకు తగ్గకుండా క్రియాశీలక సభ్యత్వలు చేయాలని, పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com