Logo
Date of Publish : 29 July 2020, 1:12 pm
Editor : Sake Naresh

ముత్యాల ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమాచారం అందించాలని మేధావులని,నిపుణులని కోరుతున్న జనసైనికులు

ముత్యాల ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమాచారం అందించాలని మేధావులని, నిపుణులని కోరుతున్న జనసైనికులు.

     జగ్గయ్యపేట నియోజకవర్గంలో, పట్టణంలో స్థానిక బైపాస్ రోడ్ వద్ద, గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు సుమారుగా 3 నెలలు ముందు ఉన్న సమయంలో అనేక మంది రైతులతో ముత్యాల ఎత్తిపోతల పథకం అనే కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంఖుస్థాపన చేయటం జరిగింది. మరీ ఈ రోజున జనసేన పార్టీ తరుపున గత ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాము మీరు చేపట్టిన ఈ కార్యక్రమం అనేది ఏ విధంగా ఈ నియోజకవర్గ రైతులకి ఉపయోగపడింది, ఎంత మంది రైతులు ఇప్పటికి మీరు చేపట్టిన ఈ పథకం మీద ఆధారపడి పొలం పనులు సాగిస్తున్నారు అని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పత్రికాముఖంగా ఆయన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు ఆంద్ర తెలంగాణ విడిపోయిన తరువాత అప్పటి ఆంధ్రప్రదేశ్ నాయకుల పనితనం వలన కేవలం సాగర్ కి సంబంధించిన నీళ్ళుఅనేవి మిగులు జలాలు మాత్రమే ఉపయోగానికి ఇచ్చేవారని, నియోజకవర్గానికి అదే విధంగా పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీటిని మరీ కొంత మేర త్రాగు నీటికి, పశు గ్రాసానికి ఉపయోగించుకోవచ్చని, ఉపయోగించుకుంటున్నారని, మరి కొంత నీటిని లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా వ్యవసాయానికి సంబంధించి కాలువ ద్వారా, చెరువుల ద్వారా మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకి అందించే అవకాశాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి సంబంచినటువంటి అనేక మంది రైతులు ప్రస్తుత పంట కన్నా ఎక్కువ పంట వేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కేవలం గత ప్రభుత్వం లో టీడీపీ వారు ఎన్నికలు ముందు ఉన్న సమయాన ఆర్బాటంగా ఎన్నికల స్టెంట్ ఉపయోగించి ప్రజలను, రైతులని మభ్యపెట్టి, వారు చేపట్టిన ఈ పథకం అనేది ఏ మాత్రం క్రియాశీలకంగా లేదు అని ఆయన తెలిపారు. మీరు రైతుల గురించి ఆలోచించేవారు ఐతే, రైతులకి న్యాయం చేయాలి అంటే ఒక ధవళేశ్వరం బ్రిడ్జి, ఒక ప్రకాశం బ్యారేజ్ లాంటివి నిర్మించిన బ్రిటిష్ సర్ ఆర్ధర్ కాటన్ లాంటి వ్యక్తులని సూర్తి గా తీసుకుని భారతదేశం యొక్క వెన్నుముక లాంటి రైతులకి వందేళ్లు గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేయాలనీ ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి సారించి, దీని మీద చొరవ చూపించి, రైతులకి ఉపయోగకరంగా ఉండాలని, దీనిని ముందుకి తీసుకెళాలని, అదే విధంగా దీనికి సంబంధించి పూర్తి విచారణ, రిపోర్ట్ జనసేన పార్టీ తరుపున తయారుచేయుచున్నామని దానికి నిపుణులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగుల సహకారం కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, నాగ, తరుణ్, పాషా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com