
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం నగరంలోని స్థానిక కమలానగర్ లోని కేఫ్ లో సైనికులందరూ వాళ్ల అభీష్టం మేరకు అనంతపురం అర్బన్ ఇంఛార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్ గారు కార్యకర్తల్ని కలవడం జరిగింది. కార్యకర్తల యొక్క క్షేమ సమాచారాలను మరియు పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు సలహాలను మరియు సూచనలు ఇస్తూ పార్టీని నగరంలోని ప్రతి ఇంటా బలోపేతం చేయడానికి మేము అందరమూ ముందు ఉంటానని తెలియజేస్తూ స్థానిక సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ మరియు వర్షం వచ్చినచో రోడ్లన్నీ జలమయమై చెరువుల వలె కనిపించే విధంగా ఉంటాయి అని అలాగే పింఛన్లు మరియు నిరుద్యోగ సమస్యలను జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్ గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఇంఛార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాటం చేస్తామని, జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, గిరిబాబు, బాబు, ప్రశాంత్, వినోద్, నారాయణస్వామి, శివయ్య, నాగార్జున మరియు నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొనడం జరిగింది.