శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు పట్టణంలో దెబ్బతిన్న రోడ్లపై శ్రమదానం చేసి నిరసన తెలపడానికి అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విచేస్తున్నారని శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లపై నిరసన తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2 న పిలుపునిచ్చారు. రోడ్లు బాగు చేయని పక్షంలో అక్టోబర్ 2వ తేదీన శ్రమదానం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా కొత్తచెరువుకి విచేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ సభకు శింగనమల నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శిలు B పురుషోత్తంరెడ్డి, జయమ్మ, మన్నల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com