
గుంటూరు ( జనస్వరం ) : క్రోసూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కడియం శివనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నీరు సరఫరా చేయడం జరిగింది. ఈ నీటి సమస్యను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క మంచినీటి సరఫరాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందు ఉంటుందని వివరించారు. గుంటూరు జిల్లా కమిటీ జనసేన పార్టీ కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ, గుంటూరు జిల్లా లీగల్ కమిటీ సంయుక్త కార్యదర్శి బయ్యవరపు నరసింహారావు, గుంటూరు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు శేఖమూరి శ్రీనివాసరావు, క్రోసూరు మండల నాయకులు జిజురి శివ లేళ్ళ నాగేశ్వరావు, గోళ్లమూడి అబ్బయ్య, నవీన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.