సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవర్ని కూడా తప్పుచేసి, తక్కువ చేసి మాట్లాడారు. వాస్తవాలనే మాట్లాడుతారు అవి అర్థం కాక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వైసిపి నాయకులు వాళ్లు పెట్టుకున్నా వాలంటీర్లని తీసుకువచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలని తగలబెట్టడం చెప్పులు దాంట్లో వేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం మీరు వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వ ఉద్యోగులుగా పెట్టారా, లేదంటే ప్రజలకి సేవకులుగా పెట్టారా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేయాలి. అదేవిధంగా వాలంటీర్లు అందరినీ కలిపి ఎవరు చెడుగా మాట్లాడరు. అందులో కొంతమంది చేసిన వికృతాలను కావచ్చు, అదేవిధంగా మిస్సయిన 31,177 మంది మహిళల ఆచూకీ కనిపెట్టని అని చెప్పి పోలీసు వ్యవస్థను గాని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను గాని కోరడం జరిగింది. అదేవిధంగా కుటుంబాలలో గోప్యంగా ఉంచవలసినటువంటి విషయాలను డేటా రూపంలో తీసుకోవడం ఎంతవరకు కరెక్టు ఆ హక్కు ఎవరిచ్చారు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు చదివిన వారిని ఐదువేల జీతంతో ముడిపెట్టి వాళ్ళ జీవితాన్ని చిన్నబిన్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఎందుకు రిలీజ్ చేయలేదు. మరి ఎందుకని ఇనాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను తగలబెట్టే వాళ్ళందరూ కూడా మరి జాబ్ క్యాలెండర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు విడుదల చేయలేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టలేదు. మరి నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు రాజధాని నిర్మాణం జరగలేదు ఎందుకు మీరందరూ ప్రశ్నించలేకపోతున్నారు. అంటే మీకు బాధ్యత లేదా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంతమందిని గురించి మాత్రమే మాట్లాడాడు ప్రింట్ మీడియాలో చూసాం. ఎన్నో సందర్భాల్లో వాలంటీర్లు డబ్బు తీసుకెళ్లిపోయారని చెప్పి వాలంటీర్లు మహిళలని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఈ విషయాన్ని ఎన్నో సార్లు ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారే తప్ప మీలాగా స్క్రిప్ట్ రాసుకొని దాన్ని చదవడానికి కూడా చేతరాక కింద మింద బడి దోలాడే వ్యక్తి కాదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్తారు. ఆయన ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే పబ్లిక్ గానే క్షమాపణ చెప్తారే తప్ప, నీ వైసిపి గుండాలకి భయపడి ఆయన ఎవరికీ క్షమాపణ చెప్పడు ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం ,మండల అధ్యక్షుడు గణపతి ,వీరబాబు, శీను , ఖాజా ,శ్రీహరి, అశోక్, చీన,అంజనెలు, ఫణి,సుమంత్,వెంకటేష్, సుమన్,అజయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com