కరోనా బారిన పడకుండా ఉండేందుకు తమ గ్రామాన్ని శానిటైజేషన్ చేసిన జనసైనికులు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలగుంట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, ఆ గ్రామాన్ని శానిటైజేషన్ చేయడానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపలేదు. ఈ గ్రామంలోని జనసైనికులు తమ స్వంత నిధులతో బ్లీచీంగ్ పౌడర్ చల్లడానికి ముందుకు వచ్చారు. జనసైనికులే స్వతహాగా ముందుకు వచ్చి వారే గ్రామాన్ని మొత్తం శానిటైజేషన్ చేశారు. గ్రామంలో ఏం సమస్య వచ్చినా పోరాడటానికి జనసేన పార్టీ ముందుంటుందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అలాగే శానిటైజర్ వాడాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దమ్మవల౦ వెంకయ్య , సైదారావు, జనసైనికులు నాగభూషణం, ముకుంద రామంజి, విష్ణు రంగ, బాబురి సాయి, నత్తనేలు, మద్దల కోటయ్య, బాదినేని సుబ్బయ్య, పసుపులేటి అంజి, వెంకీ తదితరులు పాల్గొన్నారు.