Logo
Date of Publish : 12 August 2020, 7:16 am
Editor : Sake Naresh

మానవత్వంతో ఓ మాతృమూర్తికి జీవం పోసిన జనసైనికులు

మానవత్వంతో ఓ మాతృమూర్తికి జీవం పోసిన జనసైనికులు            

    ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జనసేన వీరమహిళ తలుగు రమ్య శ్రీ గారి తల్లి తలుగు ఈశ్వరి గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆపరేషన్ చేయించి అండగా నిలబడిన జనసేన ఎన్ఆర్ఐ జనసైనికులు మండేలబాబి నాయుడు, మల్లు పాండురంగ, కునుకు రామకృష్ణ గారు ఆదుకున్నారు.  ఎంతో మంది చిన్నారులకు వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టటం జరిగింది. ఆయన స్ఫూర్తితో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా జనసేన వీర మహిళ తలుగు రమ్యశ్రీ గారి తల్లి తలుగు ఈశ్వరి గారి ఆపరేషన్ నిమిత్తం మేమున్నామని భరోసా గా నిలబడి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి జనసేన ఎన్నారై మండేల బాబి నాయుడు గారు, మల్లు పాండురంగ గారు, కునుకు రామకృష్ణ గారు మరియు కొంతమంది జనసైనికులు జనసేన వీర మహిళలలు సహాయంతో 1 లక్ష 65 వేల రూపాయలతో ఆ తల్లికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో మేము ఒక అమ్మ పడుతున్న బాధలో పాలుపంచుకుని ఆ అమ్మ బాధను మేము తీర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఆర్ఐ జనసైనికులు బాబి నాయుడు, రామకృష్ణ, పాండురంగ తెలియజేశారు. ఆ తల్లి ఆపరేషన్ కు సహకరించి ఆపరేషన్ చేయించి నటువంటి ఎన్నారైలను మరియు జన సైనికులం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని తలుగు రమ్యశ్రీ గారు మరియు వాళ్ళ తల్లి ఈశ్వరి గారు తెలియజేశారు. కష్టాల్లో ఉన్న మాకు జనసైనికులు అండగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఆపరేషన్ చేయించినటువంటి ఎన్నారైలకు జనసైనికులకు జనసేన వీర మహిళ రమ్య శ్రీ గారు మరియు వారి తల్లి ఈశ్వరి గారు మరియు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జనసైనికులు ఎన్నారై బాబి నాయుడు రామకృష్ణ పాండురంగ కు ఆపరేషన్ నిమిత్తం సహాయపడిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com