జగ్గయ్యపేట ఆర్టీసీ డీపోలో కరోనా జాగ్రత్తలు పాటించాలని జనసైనికుల వినతి.
రాష్ట్ర ప్రభుత్వం సూచలను మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, అదే విధంగా జగ్గయ్యపేట డిపో పరిధి కింద కొన్ని బస్సులని నియోజకవర్గ పరిధి కింద, విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు, మరి కొన్ని పట్టణాలకు గాని ప్రజల సౌకర్యార్ధం కోసం బస్సుల్ని నడపటం జరుగుతుంది అని, చాలా సంతోషం అని, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న కరోనా విషయాన కొన్ని జాగ్రత్తలు పాటించి బస్సుల్ని నడపవలసినదిగా కోరుచున్నాము అని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ దానికి సంబంధించి బస్సులకు శానిటైజేషన్ చేసే విషయంలో తగు చర్యలు పాటించమని, విజయవాడ నగరంలో ఈ కరోనా అనేది విపరీతంగా ఉన్న నేపథ్యంలో మరీ మన డిపో బస్సులు ద్వారా ప్రతిరోజూ ఎంతో కొంత మంది విజయవాడ వెళ్లి వస్తూ ఉంటారని, ఈ శానిటైజేషన్ చేయటం వలన కరోనా ని కొంత వరకైనా మనం కట్టడి చేయగలమని లేని యెడల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు. ప్రతి రోజు ప్రజల కోసం నడుపుతున్న బస్సులకు శానిటైజేషన్ తప్పనిసరిగా చేయవల్సినదిగా కోరుచున్నాము అని, ప్రయాణికులకు కూడా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా వారికి అవగాహనా కలిపించాలని డ్రైవర్లని, కండెక్టర్లని కోరుచున్నాము. తక్షణమే తగు చర్యలు తీసుకుని ప్రజలని అదే విధంగా ఉద్యోగుల్ని కూడా ఈ కరోనా బారిన నుండి కాపాడమని, అదే విధంగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అన్ని డిపోలలో ప్రయాణికుల కోసం నడుపుతున్న బస్సులకు తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సినదిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారిని అదే విధంగా అన్ని డిపో మేనేజర్ల వారిని జనసేన పార్టీ తరుపున, పవన్ కళ్యాణ్ గారి తరుపున కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, తరుణ్, పాషా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.