సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసైనికుల అన్నదాన కార్యక్రమం.
నంద్యాల పట్టణంలో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక NGO’s కాలనిలో అనాధ పిల్లలకు జనసైనికుల అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సంధ్య ఫౌండేషన్ ఫౌండర్ నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలాంటి పేద వారికి సహకరించాలని , చాలా మంది పేద వారు అన్నం లేక చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఈ సమయంలో అందరూ చేదోడువాదోడుగా ఉండాలని కోరారు అలాగే రానున్న రోజుల్లో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు అంతేకాకుండా అందరూ సేవ కార్యక్రమలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రసాద్, అశోక్, శివ, సతీష్, హుస్సేన్, అనిల్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.